చిన్న నాటి కలను నెరవేర్చుకున్న నీరజ్ చోప్రా

V6 Velugu Posted on Sep 12, 2021

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్​ గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా మరో కలను సాకారం చేసుకున్నాడు. తన తల్లిదండ్రులను విమానంలో తీసుకెళ్లాలనుకున్న చిన్న నాటి కలను నెరవేర్చుకున్నాడు. కర్ణాటకలోని బల్లారీలో తన ప్రమోటర్‌‌‌‌ ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్‌‌‌‌ కోసం స్పెషల్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో తన పేరెంట్స్‌‌‌‌ సతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, సరోజ్‌‌‌‌ దేవితో కలిసి చోప్రా ప్రయాణించాడు. ‘మా పేరెంట్స్‌‌‌‌ను ఫ్లైట్‌‌‌‌లో తీసుకెళ్లాలన్న ఓ చిన్న కల ఈ రోజు సాకారమైంది’ అని చోప్రా ట్వీట్‌‌‌‌ చేశాడు. చోప్రా పేరెంట్స్‌‌‌‌తో పాటు కోచ్‌‌‌‌, జర్మన్‌‌‌‌ బయో మెకానిక్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ బర్టోనియెట్జ్‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌ సూపర్‌‌‌‌ హెవీ వెయిట్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ సతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కూడా ఇందులో ప్రయాణించారు.

 

Tagged flight journey, Neeraj Chopra, Javelin throw, gold medalist Neeraj chopra, small dream

Latest Videos

Subscribe Now

More News