
జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లో కొత్త జావా 42 బాబర్ బైకును లాంచ్ చేసింది. ధరలు రూ. 2,06,500 నుండి ప్రారంభమవుతాయి. రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, బార్-ఎండ్ మిర్రర్స్, ట్యాంక్ ప్యాడ్‌లతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఈ మోటార్ సైకిల్లో 334 సీసీ ఇంజన్ఉంటుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన మోటారు 30.2 బీహెచ్పీ, 32.74 ఎన్ఎం మాగ్జిమమ్ టార్క్‌ను ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివైజ్డ్ స్విచ్ గేర్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్వంటి ఇతర ఆకర్షణలూ బాబర్ సొంతం.