హత్య కేసులో పెయింటర్ అరెస్ట్..చంపి సెల్ఫోన్ తీసుకెళ్లిన నిందితుడు.. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన

హత్య కేసులో పెయింటర్ అరెస్ట్..చంపి సెల్ఫోన్ తీసుకెళ్లిన నిందితుడు.. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన
  •     సిగ్నల్స్​ఆధారంగా పట్టుకున్న పోలీసులు

జవహర్‌‌‌‌నగర్, వెలుగు: జవహర్​నగర్​పీఎస్​పరిధిలో జరిగిన అనిల్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌‌‌‌కు తరలించారు.ఈ నెల 22న గబ్బిలాలపేటలోని దొండతోటలో 40 నుంచి 45 ఏండ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని ఇంటి యజమాని అశోక్ గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతుడిని అనిల్ కుమార్‌‌‌‌గా గుర్తించారు. 

దర్యాప్తులో భాగంగా యూపీ మహరాజ్‌‌‌‌గంజ్ జిల్లాకు చెందిన పెయింటింగ్ కార్మికుడు రాజ్‌‌‌‌పుత్ అజయ్ రాయ్ అలియాస్ జీనత్ (30)ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 18న సాయంత్రం అనిల్, అజయ్ రాయ్ కలిసి మద్యం తాగి అంబేద్కర్ నగర్‌‌‌‌లోని అనిల్ కుమార్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ రోహిత్ అనే మరో వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అజయ్ రాయ్ తన పెయింటింగ్ కూలి డబ్బులు రూ.8వేలు ఇవ్వాలని, తన ఊరికి పంపించాల్సి ఉందని అడిగాడు. అయితే, అనిల్ ఇందుకు నిరాకరిస్తూ అజయ్ రాయ్‌‌‌‌ను అసభ్యంగా తిట్టాడు. 

దీంతో కోపోద్రిక్తుడైన అజయ్ రాయ్ అనిల్‌‌‌‌పై కర్రతో బలంగా బాదాడు. రోహిత్ కూడా అదే కర్రతో అనిల్ పై అటాక్​చేశాడు. అనిల్ అక్కడికక్కడే చనిపోగా, నిందితులు గదికి తాళం వేసి పరారయ్యారు. వెళ్తూ అనిల్ ఫోన్‌‌‌‌ తీసుకువెళ్లారు. ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అజయ్ రాయ్‌‌‌‌ను పట్టుకున్నారు. మరో నిందితుడు రోహిత్ కోసం గాలిస్తున్నారు.