
ఈ ఏడాది ప్రారంభంలో ‘పఠాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ‘జవాన్’గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయానికి సరిగ్గా నెల సమయం ఉందని సోమవారం షారుఖ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన కొత్త స్టిల్‌ను పోస్ట్ చేశాడు. గుండు గెటప్‌లో ఉన్న షారుఖ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, చేతిలో గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇదొక ఎపిక్ అని, యాక్షన్ విత్ ఎమోషన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందన్నాడు షారుఖ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన ‘దుమ్మే దులిపేలా’ సాంగ్‌కు మరింత స్పందన వస్తోంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోని లుంగీ డాన్స్ పాట తరహాలో.. ఈ పాటలోనూ లుంగీ స్టెప్స్‌తో ఇంప్రెస్ చేశాడు షారుఖ్. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో ఉండి పాట పేరుకు తగ్గట్టే దుమ్ము దులుపుతోంది. నయనతార హీరోయిన్‌గా నటించగా దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.