
బెంగళూర్: తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ రిలీజ్ పై కర్నాటక జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆమెను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ‘‘జైలు రికార్డ్స్ ప్రకారం శశికళ రిలీజ్ డేట్ 2021 జనవరి 27. ఆమె కోర్టు విధించిన రూ.10 కోట్ల ఫైన్ కడితే అదే రోజున విడుదల చేస్తాం. లేకపోతే 2022 ఫిబ్రవరి 27 వరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ శశికళ పెరోల్ ను వినియోగించుకుంటే విడుదల తేదీ మారే అవకాశం ఉంది” అని జైలు సూపరింటెండెంట్ ఆర్.లత వెల్లడించారు. శశికళను ఎప్పుడు రిలీజ్ చేస్తారని వచ్చిన ఓ ఆర్టీఐ అప్లికేషన్ కు ఈ మేరకు సమాధానమిచ్చారు. శశికళ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
For More News..