
తమిళనాట హీరోగా ఆకట్టుకున్న రవి మోహన్ (జయం రవి).. ఇప్పుడు నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘బ్రోకోడ్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తూ తనే హీరోగా నటిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామి’ చిత్రాల దర్శకుడు కార్తీక్ యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నలుగురు ప్రముఖ హీరోయిన్స్ నటించనున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. స్లాప్ స్టిక్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ చిత్రం అందిస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం శివకార్తికేయ ‘పరాశక్తి’, గణేష్ కె. బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలలో రవి మోహన్ నటిస్తున్నాడు.