తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు షురూ

తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు షురూ
  • తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు షురూ
  • చైర్మన్ జయంత్ చల్లా 

ఖైరతాబాద్, వెలుగు :  అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి  డిసెంబర్ లో   తెలంగాణ,  ఏపీలో ఆటా వేడుకలు  నిర్వహిస్తున్నట్లు ఆటా చైర్మన్ జయంత్ చల్లా తెలిపారు.  ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఆదివారం నుంచి ఈనెల30వ వరకు  తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  

వనపర్తిలో విద్యా సదస్సు.. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి విదేశీ విద్య..ఉద్యోగాలకు  అప్లై చేసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణతోపాటు ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో  వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 20 రోజుల్లో 15 ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది ఇండియా నుంచి అమెరికాకు వచ్చేవారి సంఖ్య  లక్ష కాగా,  నివసించే వారు 10 లక్షలు దాటిందని వివరించారు. ఈ సమావేశంలో కో చైర్మన్  వేణు సంకినేని, ఆటా కార్యదర్శి రామకృష్ణారెడ్డి,  కోశాధికారి సతీశ్​రెడ్డిలతో కలిసి అనంతరం బ్రోచర్లను  ఆవిష్కరించారు.