
ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి YCP లో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో YS జగన్ నివాసంలో ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన జయసుధ…రాజకీయాల్లోకి రావడానికి కారణం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. YS జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయడం అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేస్తానన్నారు. YCPలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్న జయసుధ… పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2016లో TDPలో చేరారు జయసుధ.