అమెరికా అధ్యక్ష బాధ్యతలకు రెడీ అంటున్న జేడీ వాన్స్.. ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది..?

అమెరికా అధ్యక్ష బాధ్యతలకు రెడీ అంటున్న జేడీ వాన్స్.. ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది..?

JD Vance: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న గుసగుసలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడితే ట్రంప్ స్థానంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సంసిద్ధంగా ఉన్నట్లు వాన్స్ చెప్పటం ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే క్రమంలో అమెరికా ప్రజల్లో ట్రంప్ ఆరోగ్యం, రాజకీయ అలజడుల గురించి ఉన్న అనుమానాలను తగ్గించేందుకు వాన్స్ కామెంట్స్ దోహపడుతుతున్నాయి.

అసలు ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ట్రంప్ ఎదుర్కోవటం లేదని చెబుతూ ఫుల్ ఎనర్జీతో వర్క్ చేస్తున్నట్లు వాన్స్ వెల్లడించారు. 41 ఏళ్ల వాన్స్ తాను ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన 200 రోజుల అనుభవం ఎలాంటి అనిశ్చితులైనా ఎదుర్కోవటానికి దోహపడుతుందని చెప్పారు. ట్రంప్ తన అధ్యక్ష కాలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలని ఆయన పూర్తి ఆరోగ్యంతో అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పనిచేస్తున్నారని వాన్స్ అన్నారు. 

ప్రెసిడెంట్ ట్రంప్ తరచుగా ఎక్కువ పనిగంటలు వర్క్ చేయటంతో పాటు తన కంటే చిన్న వయస్సు ఉన్న చాలా మంది ఉద్యోగుల కంటే చురుకుగా ఉన్నట్లు చెప్పారు. అందరికంటే ఆలస్యంగా నిద్రకుపక్రమించే ట్రంప్ ఉదయాన్నే కూడా పెందలకాడ లేచి వర్క్ చేస్తుంటారని వాన్స్ వెల్లడించారు. దేశం కోసం పనిచేయటంలో ట్రంప్ అవిశ్రాంతంగా ముందుకు సాగుతున్నారన్న వాన్స్ గతంలో అమెరికా అధ్యక్షులపై కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల గురించి వచ్చిన ఊహాగానాల మాదిరిగానే ట్రంప్ పై కథనాలను కొట్టిపడేశారు. అలాగే తాను బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కామెంట్స్ చేస్తూ రాజకీయ అనిశ్చితిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. 

ALSO READ : భారత్‎ను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు

వాస్తవానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జియా మయూంగ్ తో మీటింగ్ సమయంలో ట్రంప్ చేతికి ఒక బ్యాండేజ్ కనిపించటంతో ట్రంప్ ఆరోగ్యంపై వచ్చిన కథనాలు అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ప్రస్తుతం వాన్స్ చేసిన కామెంట్ అటు అంతర్గతంగా పార్టీలో ఆయనకు మైలేజ్ రావటంతో పాటు ఫేక్ వార్తలకు కళ్లెం పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.