ఎన్డీయేలో చేరికంటే .. జేడీఎస్లో చీలకలుంటాయి.. హెచ్చరించిన రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్డీయేలో చేరికంటే .. జేడీఎస్లో చీలకలుంటాయి..  హెచ్చరించిన రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్డీయేలో చేరికంటే .. జేడీఎస్లో చీలకలుంటాయంటూ బహిరంగగానే సంకేతాలు ఇచ్చారు  జనతాదళ్‌ సెక్యులర్‌ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి సి.ఎం. ఇబ్రహీం. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయేలో చేరబోదని చెప్పారు.  రాబోయే  లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో కలిసి  వెళ్లాలని జేడీఎస్ భావిస్తుంది. అందులో భాగంగానే  2023 సెప్టెంబర్ 22న ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కుమారస్వామి భేటీ అయ్యారు. అనంతరం ఎన్డీయేలో చేరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. 

 ఈ క్రమంలో పార్టీ నేతలతో   సి.ఎం. ఇబ్రహీం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇబ్రహిం..  కుమారస్వామిని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతానని ఆడుగుతానని అన్నారు.   ఒకవేళ ఆయన  అంగీకరించకపోతే.. వారు ఎన్డీయేలోకి  వెళ్తే అడ్డుకోమని,   పార్టీ ఎమ్మెల్యేల సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తామని ఇబ్రహీం అన్నారు. 

తనతో కొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారి పేర్లను ఇప్పుడే  బహిరంగగా చెప్పాలని అనుకోవడం లేదన్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నప్పటికీ జేడీఎస్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే మూడో పార్టీగా అవతరించింది.  ఈ ఏడాది అక్కడ  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.