
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఈ ఫలితాల్లో బాంబే జోన్ కు చెందిన ఆర్కే శిశిర్ టాపర్ గా నిలిచాడు. మొత్తం 360 మార్కులకు 314 మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
ఢిల్లీ జోన్ కు చెందిన తనిష్క కబ్రా 277 మార్కులతో బాలికల్లో టాపర్ గా నిలిచింది. ఆమె ఆల్ ఇండియాలో 16వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 28న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు లక్షా 50 వేల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది అర్హత సాధించారు.