పేపర్ 1 కఠినంగా.. పేపర్ 2 ఈజీగా. .

 పేపర్ 1 కఠినంగా.. పేపర్ 2 ఈజీగా. .
  • ప్రశాంతంగా ముగిసిన జేఈఈ అడ్వాన్స్​డ్ 

హైదరాబాద్, వెలుగు: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్ డ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగ్గా, తెలంగాణలోని హైదరాబాద్​తో సహా 13 ఏరియాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం-12 గంటల వరకు పేపర్‌‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం  5.30 గంటల వరకు పేపర్‌‌-2 పరీక్ష ఆన్​లైన్​లో జరిగింది. తెలంగాణ నుంచి సుమారు 20వేల మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ అయ్యారు. 

అయితే, పరీక్షా కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, పేపర్–1 కాస్త కఠినంగా ఉండగా.. పేపర్ 2 ఈజీగా వచ్చిందని విద్యార్థులు తెలిపారు. అయితే,  మ్యాథమేటిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండగా, ఫిజిక్స్ ప్రశ్నలు మధ్యస్తంగా, కెమిస్ర్టీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని  పేర్కొన్నారు. అయితే, ఈ నెల 22న ఓఎంఆర్ షీట్లను వెబ్​సైట్​లో అప్ లోడ్ చేయనుండగా, 26న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనున్నారు. జూన్ 2న జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.