కరోనా ఎఫెక్ట్: జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా

V6 Velugu Posted on May 04, 2021

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా.. కీలక పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. లేటెస్టుగా JEE మెయిన్స్ పరీక్ష వాయిదా పడ్డాయి. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల (మే) 24 నుంచి 28వ తేదీ వరకు JEE మెయిన్స్ జరగాల్సి ఉంది.

అయితే.. కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండడంతో వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని ప్రకటించింది. 'ఎన్టీఏ అభ్యాస్ యాప్' ద్వారా ఇంటి దగ్గర నుంచే నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.

Tagged corona, JEE Main 2021, exam postponed

Latest Videos

Subscribe Now

More News