
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్ఐటీలతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్–2020 ఎగ్జామ్స్సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లాన్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సోమవారం నుంచి శనివారం వరకు పరీక్షలు జరగనున్నాయి. 31న రిజల్ట్స్ ప్రకటించనున్నట్టు నేషనల్ టెస్టింగ్‌ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది, తెలంగాణ నుంచి 60 వేల మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జేఈఈ మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ . రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒకటి, 2.30 నుంచి 5.30 గంటల వరకు మరొకటి ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌లలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షకు హాజరయ్యే వారు 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా సర్కారు గుర్తింపు కార్డు కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది.