జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2లో సత్తా చాటిన తెలుగు స్టూడెంట్లు

జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2లో సత్తా చాటిన తెలుగు స్టూడెంట్లు

హైదరాబాద్‌, వెలుగు: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 (ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌) పరీక్ష ఫలితాల్లో తెలుగు స్టూడెంట్లు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో టాప్‌ 10లో ఆరు ర్యాంకులను ఏపీ, తెలంగాణ స్టూడెంట్లే సొంతం చేసుకున్నారు. ఓపెన్‌ కేటగిరీలో ఏపీకి చెందిన లక్ష్మినారాయణ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, రఘునందన్‌రెడ్డి రెండు, రితీష్‌రెడ్డికి నాలుగో ర్యాంకు వచ్చింది. రాష్ట్రానికి చెందిన పెద్దయ్యగారికి రాహుల్‌రెడ్డి ఐదోర్యాంకు, రాంమోహన్‌ అభిషేక్‌ ఏడో ర్యాంకు, అభిజిత్‌ 9వ ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 8న రెండో విడతగా నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2కు 1,69,759 మంది దరఖాస్తు చేసుకోగా 1,44,032 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ర్టాల నుంచి 15 వేల మంది పరీక్ష రాసినట్టు అంచనా. జనవరిలో జరిగిన పరీక్షకు 1.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 1.45 లక్షల మంది హాజరయ్యారు.