జేఈఈ మెయిన్స్ కీ రిలీజ్

జేఈఈ మెయిన్స్ కీ రిలీజ్

ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల తుది ఆన్సర్‌ కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ సోమవారం పేపర్‌ -1 ‘ఫైనల్‌ ఆన్సర్‌ కీ’ని విడుదల చేసింది.

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 12, 25, 529 మంది హాజరైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఎన్టీఏ.