జీడిమెట్ల, వెలుగు: ఫేక్ ల్యాండ్డాక్యుమెంట్స్, ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు సృష్టించి రూ.కోట్ల ప్లాట్స్కబ్జా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు. బాలానగర్డీసీపీ కె.సురేశ్కుమార్శుక్రవారం డీసీపీ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన నంద్యాల సురేశ్‌కుమార్20 ఏండ్ల కిందట కుత్బుల్లాపూర్సుభాష్నగర్లో 200 గజాలు కొన్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి జాగా చూసుకుని వెళ్లేవాడు. స్థలంపై సుభాష్‌నగర్‌కి చెందిన బీఆర్ఎస్మహిళా లీడర్ పద్మజారెడ్డి అలియాస్కుత్బుల్లాపూర్పద్మక్క కన్నుపడింది. భూమి కబ్జా చేయడానికి ప్రణాళిక రచించింది.
ఇందులో భాగంగా ఫేక్డ్యాకుమెంట్స్తయారీలో నిపుణుడైన హయత్‌నగర్‌కి చెందిన కరుణాకర్‌ను సంప్రదించింది. రూ.3.50 లక్షలు ఇవ్వడంతో అతడు ఫేక్డ్యాకుంమెంట్స్తోపాటు, ల్యాండ్ఓనర్సురేశ్1992లో చనిపోయినట్లు ఫేక్డెత్సర్టిఫికెట్, లీగర్హెయిర్ సర్టిఫికెట్సృష్టించి ఆమెకు ఇచ్చాడు. ఈ ఫేక్డాక్యుమెంట్స్తో ఫిబ్రవరి2023లో కుత్బుల్లాపూర్ఎస్ఆర్ఓ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్చేయించింది. అసలు ఓనర్ప్లాట్వద్దకు వెళ్లగా అతన్ని బెదిరించి పంపించివేశారు.
దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి మేకల హరీశ్సాయంతో ఆధార్ కేంద్రంలో పనిచేసిన గగణం నరేంద్ర అలియాస్నందు సహకారంతో రవిశంకర్వారసుడుగా ఫేక్ఆధార్కార్డు, పాన్‌కార్డు, లీగల్‌హెయిర్ సర్టిఫికెట్స్తయారు చేసినట్లు గుర్తించారు. ఇలా తయారు చేసిన డాక్యుమెంట్స్‌తో పద్మజా రెడ్డి తన చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి పేర్ల మీద ప్లాట్రిజిస్ట్రేషన్చేసింది.
దీంతో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్పరారీలో ఉన్నాడు. ఈ ముఠాపై హయత్‌నగర్, మీర్పేట్, మేడిపల్లి ,సుల్తాన్‌బజార్, మైలార్‌దేవ్‌పల్లిలో ఆరు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 8 ఫేక్డాక్యుమెంట్లను సీజ్‌చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా హయత్‌నగర్‌లో 274 గజాలు, జూబ్లిహిల్స్‌లో 1000 గజాలు, వైజాగ్‌లో ఒక స్థలాన్ని కబ్జా చేయడానికి ఫేక్డ్యాకుమెంట్తో సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.