నేడు స్పేస్ లోకి జెఫ్ ​బెజోస్ టూర్

V6 Velugu Posted on Jul 20, 2021

  • అమెజాన్ మాజీ చీఫ్​తో సహా నలుగురి రోదసియాత్ర

వాషింగ్టన్: అంతరిక్షంలోకి మరో టూర్ కు రంగం సిద్ధమైంది. అమెజాన్ మాజీ సీఈవో జెఫ్ బెజోస్​తో పాటు మరో ముగ్గురు మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు స్పేస్ టూర్​కు వెళ్లనున్నారు. పదిరోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్  అధినేత రిచర్డ్ బ్రాన్సన్, శిరీష బండ్ల తదితరులు విజయవంతంగా రోదసి యాత్రకు పోయొచ్చారు. ఈసారి జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ స్పేస్ టూర్ చేపట్టింది. ఈ టూర్​లో ఆస్ట్రోనాట్​ల మాదిరిగా రాకెట్​ను, క్యాప్సూల్​ను వాడుతున్నారు. క్యాప్సూల్​లో ఆరు సీట్లు ఉంటాయి. బెజోస్​తో పాటు ఆయన తమ్ముడు మార్క్ బెజోస్, అమెరికన్ మాజీ మహిళా పైలట్ వాలీ ఫంక్(82), వేలంలో టికెట్​ను కొనుక్కున్న ఓ వ్యక్తి తరఫున నెదర్లాండ్స్ టీనేజర్ ఒలివర్ డీమెన్(18) ప్రయాణిస్తున్నారు.

Tagged washington, Jeff Bezos, space tour, amazon ceo bezos, blue origin

Latest Videos

Subscribe Now

More News