అమెజాన్ సీఈవో మాజీ భార్య దాతృత్వం.. 4 నెలల్లో రూ.29,426 కోట్ల దానం

అమెజాన్ సీఈవో మాజీ భార్య దాతృత్వం.. 4 నెలల్లో రూ.29,426 కోట్ల దానం

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ త‌న దాతృత్వంతో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. త‌న సంప‌ద‌ను విరాళా‌ల రూపంలో ఇచ్చేస్తున్నారు. గ‌డిచిన నాలుగు నెల‌ల్లో 4 బిలియన్ డాలర్లకు మించి (రూపాయిల్లో 29,426 కోట్లు) దానం చేశారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో 18వ స్థానంలో ఉన్న‌‌ మెకంజీ త‌న ఆస్తిలోని సుమారు 420 కోట్ల డాల‌ర్ల‌ను ప‌లు ఛారిటీ సంస్థ‌ల‌కు విడుద‌ల చేశారు.

బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం ఈ సంవత్సరం ఆమె సంపద రూ.23.6 బిలియన్లు పెరిగి… మొత్తంగా రూ.60.7బిలియన్లకు(రూ.49,289 కోట్లు) చేరింది. ఈ ఏడాదిలో మెకంజీ సంప‌ద సుమారు 24 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగింది. ఇందుకు కార‌ణం మెకంజీ ఆస్తుల‌న్నీ.. అమెజాన్ డాట్‌కామ్‌తో లింక్ అయి ఉండ‌డ‌మే. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఆ సంస్థ షేర్లు ఇటీవ‌ల 67 శాతం పెరిగిన విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మారి వ‌ల్ల ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుండ‌డంతోఅమెజాన్ షేర్ల విలువ శ‌ర‌వేగంగా పెరుగుతోంది.