నవ్వుల జిలేబి ..మా హాస్టల్‌‌లో ఉన్నది స్టూడెంట్స్ కాదు.. వజ్రాలు

నవ్వుల జిలేబి ..మా హాస్టల్‌‌లో ఉన్నది స్టూడెంట్స్ కాదు.. వజ్రాలు

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సక్సెస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన కె.విజయ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న సినిమా ‘జిలేబి’. విజయ్ భాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. శివాని రాజశేఖర్ హీరోయిన్‌‌. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘మా హాస్టల్‌‌లో ఉన్నది స్టూడెంట్స్ కాదు.. వజ్రాలు. ఇరవై నాలుగు గంటలు చదువుతూనే ఉంటారు’ అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్‌‌తో మొదలైన టీజర్  అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌‌‌‌గా సాగింది. కామెడీకి హారర్‌‌‌‌ను మిక్స్ చేసి హిలేరియస్‌‌గా టీజర్‌‌‌‌ను కట్ చేశారు.  శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ బ్యాక్‌‌గ్రౌండ్‌‌  స్కోరు  ఫన్‌‌ని మరింత ఎలివేట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు.