మళ్లీ జెట్‌‌ టేకాఫ్.. రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్​

మళ్లీ జెట్‌‌ టేకాఫ్.. రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్​
  • రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేసే చాన్స్‌
  • డీల్‌ కు ఓకే చెప్పిన క్రెడిటర్ల కమిటీ
  • మరిన్ని అనుమతులు కావాలంటున్న ఎక్స్‌ పర్టులు

న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల క్రితం మూసుకుపోయిన జెట్‌‌‌‌ విమానాల రెక్కలు మళ్లీ తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుల కుప్పగా మారిన జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ తిరిగి రన్‌‌‌‌వేపైకి రావొచ్చు. నష్టాల కారణంగా దివాలా తీసిన ఈ కంపెనీని కాల్‌‌‌‌రాక్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ ఫౌండర్​ ఫ్రిష్​, మురారీలాల్ జలన్‌‌‌‌ దక్కించుకున్నారు. వీళ్లు అందజేసిన రిజల్యూషన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌‌‌‌ ఈ–వోటింగ్‌‌‌‌ ద్వారా ఆమోదించారు. ఐబీసీ సెక్షన్‌‌‌‌ 30 (4) ప్రకారం జలన్‌‌‌‌, ఫ్లోరియన్‌‌‌‌ ఫ్రిష్‌‌‌‌ల ప్లాన్‌‌‌‌కు ఓకే చెప్పామని రిజల్యూషన్‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్లాన్‌‌‌‌కు ఎన్సీఎల్టీ నుంచి అప్రూవల్ తీసుకురావాల్సి ఉంటుంది. తదనంతరం పర్మిషన్ల కోసం సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌, కార్పొరేట్‌‌‌‌ ఎఫైర్స్‌‌‌‌ మినిస్ట్రీలకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే జెట్‌‌‌‌ను నిలబెట్టడానికి జలన్‌‌‌‌, ఫ్రిష్‌‌‌‌లు ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తారని తెలుస్తోంది. పాత విమానాలను అమ్మి మరికొంత డబ్బు సమీకరిస్తారని సమాచారం.

రెన్యువల్స్‌‌‌‌ తప్పనిసరి…

ఎయిర్‌‌‌‌పోర్టుల్లో జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌‌‌ స్లాట్లను, ట్రాఫిక్‌‌‌‌ రైట్లను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు ఇచ్చారు. ఈ కంపెనీ పర్మిట్‌‌‌‌ను, పైలెట్ల లైసెన్సులను రెన్యువల్‌‌‌‌ చేయించుకోవాలి. అయితే ఇదేమంత పెద్ద పని కాదని, త్వరగానే రెన్యువల్‌‌‌‌ అవుతాయని సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ మినిస్ట్రీ ఆఫీసర్‌‌‌‌ ఒకరు చెప్పారు. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌‌‌ తమకు రూ.40 వేల కోట్లు చెల్లించాలని ఫైనాన్షియల్‌‌‌‌ క్రెడిటర్లు, ఆపరేషనల్‌‌‌‌ క్రెడిటర్లు, ఉద్యోగులు రిజల్యూషన్‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌కు చెప్పారు. ఆయన రూ.15,525 కోట్ల క్లెయిమ్స్‌‌‌‌కు మాత్రమే ఒప్పుకున్నారు. స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, యెస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ వంటివి తమకు రూ.11,344 కోట్ల బకాయిలు రావాలని మొదట డిమాండ్‌‌‌‌ చేశాయి. చివరికి రూ.7,459.80 కోట్లు తీసుకునేందుకు ఒప్పుకున్నాయి.  అప్పులపై లెండర్లు భారీ మొత్తంలో హెయిర్‌‌‌‌కట్‌‌‌‌కు (చెల్లింపులో కోతకు ఒప్పుకోవడం) అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. కరోనా వల్ల ప్రస్తుత ఎయిర్‌‌‌‌లైన్‌‌‌‌ కంపెనీలకు చాలా నష్టాలు వస్తున్నాయి. ఇదే మహమ్మారి కొత్త ఇన్వెస్టర్లకు కూడా అవకాశాలు తెచ్చిపెట్టాయని ఎక్స్‌‌‌‌పర్టులు అంటున్నారు. ‘‘కొత్త జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ విమాన కంపెనీలతో, లీజుకు ఇచ్చే వాళ్లతో బాగా బేరం ఆడవచ్చు. పైగా లీజు రేట్లు కూడా తగ్గాయి.పైలెట్ల కొరత లేదు. చాలా మంది తక్కువ జీతాలకే చేరడానికి రెడీగా ఉన్నారు’’ అని ఏవియేషన్‌‌‌‌ కన్సల్టంటు కేజీ విశ్వనాథ్‌‌‌‌ అన్నారు. కరోనా వల్ల ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ విమానాల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పడిపోయింది. ఎయిరిండియా, విస్తారా మాత్రమే బిజినెస్‌‌‌‌ క్లాస్‌‌‌‌ టికెట్లు ఇస్తున్నాయి. ఈ సమయంలో ప్రీమియం ట్రాఫిక్‌‌‌‌ను ఆకర్షించడం జెట్‌‌‌‌కు సాధ్యపడుతుందని భావిస్తున్నారు.

కార్‌‌‌‌లాక్‌‌‌‌..యూరప్‌‌‌‌ కంపెనీ

యూరోపియన్‌‌‌‌ ఎంట్రప్రిన్యూర్‌‌‌‌ ఫ్లోరియన్‌‌‌‌ ఫ్రిష్‌‌‌‌ కార్‌‌‌‌లాక్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ను స్థాపించారు. ఇది ఫైనాన్షియల్‌‌‌‌ అడ్వైజరీ, అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీ. ఫ్రిష్‌‌‌‌  16 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించారు. 20 ఏళ్లుగా ఎలక్ట్రో మొబిలిటీ, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, రిన్యూవబుల్‌‌‌‌ ఎనర్జీల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తున్నారు. టెస్లాలో 2008లో పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉంటే, జలన్‌‌‌‌ యూఏఈకి చెందిన బిజినెస్‌‌‌‌మ్యాన్‌‌‌‌.