ఊరెళ్లొచ్చేసరికి నగలు, నగదు చోరీ

ఊరెళ్లొచ్చేసరికి నగలు, నగదు చోరీ

జవహర్ నగర్, వెలుగు: బంధువుల ఇంటికి వెళ్లొచ్చే సరికి దొంగలు పడి నగలు, నగలు ఎత్తుకెళ్లారు. జవహర్ నగర్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. దమ్మాయిగూడ పరిధి సాయి సిద్ధార్థ కాలనీలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి మంగలిపల్లి రవీందర్ కుటుంబంతో ఉంటున్నాడు.  సోమవారం సిద్దిపేటలో బంధువు వర్థంతి కార్యక్రమం ఉండగా రవీందర్ కుటుంబం వెళ్లింది. 

మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని 10 తులాల బంగారం, కొంత వెండి, నగదు మాయమైంది. దొంగలు పడ్డారని తెలుసుకుని బాధితుడు జవహర్ నగర్ పోలీసులు కంప్లయింట్ చేశాడు. పోలీసులు వెళ్లి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.