ధడక్ హీరోకు జలక్

ధడక్ హీరోకు జలక్

రూల్స్ అంటే రూల్సే అంటున్నారు ముంబై ట్రాఫిక్ అధికారులు. రూల్స్ పాటించకపోతే సెలబ్రిటీ అయినా వారిని వదిలేది లేదని అంటున్నారు. బాలీవుడ్ లో ఆ మధ్య వచ్చిన మ్యూజికల్ లవ్ స్టోరీ ‘ధడక్’ సినిమాతో ఆకట్టుకున్న కుర్ర హీరో ఇషాన్ ఖట్టర్ కు.. ఆ విషయం బాగా తెలిసొచ్చింది.

ఇషాన్ ఖట్టర్ కు బైక్స్ అంటే బాగా ఇష్టం. కొత్త మోడల్ బైక్స్ నడుపుకుంటూ ముంబై రెగ్యులర్ గా కనిపిస్తుంటాడు ఇషాన్. రీసెంట్ గా బాంద్రాలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. తన బైక్ ను నో పార్కింగ్ జోన్ లో పార్కింగ్ చేశాడు. దీంతో.. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ బైక్ ను లిఫ్ట్ చేసి వెహికల్ లో ఎక్కించారు.

రెస్టారెంట్ నుంచి బయటకొచ్చిన ఇషాన్.. తన బైక్ ట్రాఫిక్ వెహికల్ లో ఉందని తెలిసి షాకయ్యాడు. ఆ బైక్ నాదే అని… ఇషాన్ ట్రాఫిక్ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నాడు. రాంగ్ రూట్లో పార్కింగ్ చేసినందుకు ఫైన్ కడితేనే బైక్ ఇస్తామని పోలీసులు అతడికి చెప్పారు. రూ.500 ఫైన్ కట్టి తన బైక్ ను విడిపించుకుని వెళ్లిపోయాడు ఇషాన్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది.

గతంలోనూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడుపుతున్నప్పుడు ఇషాన్ కు క్లాస్ తీసుకున్నారు స్థానికులు.

ధడక్ లో జాహ్నవీ కపూర్ తో కలిసి నటించి తెరకు పరిచయమయ్యాడు ఇషాన్. ఇటీవల తన సినిమాలో పాత్రకోసం ఏస్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ.. ఇషాన్ ను సంప్రదించారు.