కేజ్రీవాల్ భార్యను కలిసిన జార్ఖండ్ మాజీ సీఎం భార్య

కేజ్రీవాల్ భార్యను కలిసిన జార్ఖండ్ మాజీ సీఎం భార్య

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భర్యను జార్ఖాండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్  భార్య కల్పన సోరేజ్ కలిశారు. ఆమె శనివారం ఢిల్లీకి వచ్చి సునీతా కేజ్రీవాల్ కు ధైర్యం చెప్పారు. కేజ్రీవాల్ కో ఆశీర్వాద్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. అప్పుడు హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిన విషయాన్ని, ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో ఏదైతే జరిగిందో.. ప్రస్తుతం ఢిల్లీలో అదే జరుగుతోందని విమర్శించారు.

సునీతా కేజ్రీవాల్ భార్య బాధను పంచుకోవడానికి ఇక్కడికి వచ్చానని, కలిసి పోరాడుతామని ఆమె పిలుపునిచ్చారు. సోనియాగాంధీని కలువబోతున్నానని, జార్ఖండ్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆమెతో చర్చిస్తానని కల్పనా సోరెన్‌ తెలిపారు.  లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మార్చి 31న రాం లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో ఆమె కూడా పాల్గొంటున్నాట్లు చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టిఎంసికి చెందిన డెరెక్ ఓబ్రెయిన్, డిఎంకెకు చెందిన తిరుచ్చి శివ, ఎన్‌సికి చెందిన ఫరూక్ అబ్దుల్లా,చంపై సోరెన్ హాజరుకానున్నట్లు ఆప్ తెలిపింది. 20వేల మందితో ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఉందని ప్రకటించారు.