జార్ఖండ్‌‌లో 2 పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే

జార్ఖండ్‌‌లో 2 పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే

రాంచీ: జార్ఖండ్‌‌లో 11వ, 12వ, 13వ జేపీఎస్సీతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షల రద్దు నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఇదివరకే ఉద్యోగాల్లో చేరిన 2 వేల మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. రెండు పరీక్షల రద్దు ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. ఎంపికైన అభ్యర్థులు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించింది. 15 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 నుంచి నిర్వహించిన నియామక పరీక్షలను రద్దు  చేయాలంటూ ‘సంస్కరణల మంచ్’ ఆధ్వర్యంలో 26 రోజుల పాటు ఆందోళనలు చేయడంతో.. దిగొచ్చిన ప్రభుత్వం 24 పరీక్షలను రద్దు చేసింది. పలు పరీక్షలపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పరీక్షల్లో సంస్కరణలకు ప్రత్యేక కమిటీ కూడా వేసింది.