
భారత్ – చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం పనులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా లఢఖ్‌లో రోడ్డు నిర్మాణ పనుల కోసం 1500 మందికి పైగా కార్మికులతో జార్ఖండ్ నుంచి శనివారం ప్రత్యేక రైలు బయలుదేరింది. ఈ రైలును దుమ్కా స్టేషన్‌లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్మికులను ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకుని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) తీసుకుని వెళ్లింది. దీని సంబంధించి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, జార్ఖండ్ రాష్ట్ర కార్మిక శాఖకు మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంతో పాటు సరిహద్దు ప్రాంతాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లోనూ జార్ఖండ్ సోదరుల కృషి ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా జార్ఖండ్ కార్మికులు గడ్డకట్టే చలి వాతావరణంలోనూ లేహ్ లాంటి సరిహద్దు ప్రాంతాలను దేశంతో కలిపే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారని చెప్పారు. దేశం కోసం క్లిష్ట పరిస్థితుల్లోనూ శ్రమిస్తున్న కార్మికుల సంరక్షణ, వారి హక్కులను కాపాడడం తమ బాధ్యత అని, వారి సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయబోమని తెలిపారు. వారి రక్షణతో పాటు వసతి, ఇతర సౌకర్యాల విషయంలో బోర్డర్ రోడ్స్ ఆర్డనైజేషన్ బాద్యత తీసుకునేలా ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు.
ఇటీవల సరిహద్దుల్లో చైనా దుందుడకుగా వ్యవహరిస్తూ భారత భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో రక్షణ శాఖ వ్యూహాత్మక రోడ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసింది. లఢఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ప్రాంతాల్లో మన సైన్యం పనులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్రిక్తతలకు కారణమైన చైనా ఆర్మీ మన దేశ సైనిక, విదేశాంగ చర్చల తర్వాత మళ్లీ వెనుకడుగేసింది. అయితే చైనా వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరిహద్దు రోడ్ల నిర్మాణం సహా ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లఢఖ్ ప్రాంతాల్లో పనులు చేసట్టేందుకు జార్ఖండ్ నుంచి అదనంగా దాదాపు 11,800 మంది కార్మికులను సరిహద్దు ప్రాంతాలకు తరలించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చులు జరిపి.. జూన్ 8న వారి రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రత్యేకంగా ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా తొలి ట్రైన్ ఈ రోజు 1648 మంది కార్మికులతో లఢఖ్ బయలు దేరింది. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ సమయంలో కార్మికులను పనుల కోసం తరలిస్తుండడంతో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
वर्षों से ठंड में हाड़ कंपाने वाले लेह जैसे दुर्गम क्षेत्र में काम करने गए झारखण्डवासियों को अनेकों परेशानियों का दंश झेलना पड़ा है।
आज देश सेवा में गौरव और सम्मान के साथ जा रहे मेरे झारखण्डी भाईयों को मैं भरोसा देता हूँ कि उनके अधिकार की रक्षा के लिए उनका यह भाई हमेशा खड़ा है। pic.twitter.com/QGJrQzhU0C
— Hemant Soren (घर में रहें – सुरक्षित रहें) (@HemantSorenJMM) June 13, 2020