ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ బాటలో జియో చార్జీల బాదుడు

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ బాటలో జియో చార్జీల బాదుడు
  • డిసెంబర్ 1 నుంచి చార్జీల పెంపు

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ బాటలో రిలయన్స్ జియో కూడా మొబైల్ చార్జీల బాదుడు ప్రారంభించింది. ఎవరూ ఊహించని రీతిలో ఉచితంగా సర్వీసులు ప్రారంభించి ప్రత్యర్థులను నాశనం చేసిన జియో ఇపుడు కస్టమర్లందరూ తన చేతికి వచ్చాక బాదుడు మొదలు పెట్టింది. వారం రోజుల క్రితం ఎయిర్‌టెల్‌ చార్జీల పెంపు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మరుసటి రోజు వొడాఫోన్‌ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఇపుడు రిలయన్స్‌ జియో కూడా చార్జీలను పెంచేసింది.
ప్రత్యర్థి మొబైల్ కంపెనీలు చార్జీలు పెంచిన వారంలోనే జియో కూడా అదేబాటలో రేట్లు పెంచడం గమనార్హం. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ఇవాళ రిలయన్స్‌ జియో ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 
రిలయన్స్ జియో కస్టమర్లు బేసిక్‌ ప్లాన్‌కు రూ.75కు ఇక నుంచి రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.199 ప్లాన్‌ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. రూ.444 ప్లాన్‌ను రూ.533కు పెంచగా అలాగే రూ.555 ప్లాన్‌ను రూ.666 ప్లాన్ గా మార్చేసింది.