కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో మీ మొబైల్ లో ఇలా తెలుసుకోండి

కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో మీ మొబైల్ లో ఇలా తెలుసుకోండి

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, జియో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా..? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయనే అంశాల్ని తెలుసుకునేలా టూల్ ను అందుబాటులోకి తెచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సూచనలతో ఎయిర్ టెల్ థ్యాంక్స్ పేరుతో ఎయిర్ టెల్ – అపోలో ఆస్పత్రి భాగస్వామ్యంలో యాప్ లో ఇన్ఫర్మేషన్ అప్ డేట్ చేస్తుంది. ఏజ్, బాడీ వెయిట్, ట్రావెల్ హిస్టరీని ఎంటర్ చేయాల్సి ఉంది. యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చెబుతోంది. ఇందులో కరోనా వైరస్ ఉందనే విషయాన్ని వెల్లడించదు. జలుబు , జ్వరం లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలని సలహా ఇస్తుంది.

ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో ఎలా చెక్ చేసుకోవాలి

గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అనంతరం యాప్ లో ఇండియా ఫైట్ కోవిడ్ – 19 పేరుతో స్లైడర్ కనిపిస్తుంది. ఆ స్లైడర్ లో ఉన్న ఇండియా ఫైట్ కోవిడ్ – 19 ఆప్షన్ ను క్లిక్ చేసి మన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేస్తే కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చెబుతోంది. 

జియో – కేంద్ర ప్రభుత్వ వాట్సాప్ చాట్ బోట్ 

జియో – కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో my gov Corona Help desk పేరుతో  వాట్సాప్ చాట్ బోట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ లో కరోనా వైరస్ గురించి అనుమానాల్ని నివృత్తి చేసుకోవడంతో పాటు మెడిసిన్ ఎప్పుడు తీసుకోవాలి..? ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి..?అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.

వాట్సాప్ చాట్ బోట్  లో ఇలా చెక్ చేసుకోవచ్చు. 

జియో  – కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో వాట్సాప్ చాట్ బోట్ అందుబాటులో ఉంది. కరోనా వైరస్ గురించి, లక్షణాల గురించి తెలుసుకోవాలంటే మూ మొబైల్ వాట్సప్ నుంచి 919013151515 ను యాడ్ చేసుకోవాలి లేదంటే 919013151515 అని మెసేజ్ పెడితే మనకు రిప్లయి వస్తుంది. అనంతరం మన ఇన్ఫర్మేషన్ ఇస్తే కరోనా వైరస్ లక్షణాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు.