ఫ్లైట్ లో ఫ్రీ ఇంటర్నెట్ కు జియో దరఖాస్తు

ఫ్లైట్ లో ఫ్రీ ఇంటర్నెట్ కు జియో దరఖాస్తు

కనెక్టి విటీ సేవలను అందించడానికి అవసరమైన ఇన్‌‌ ఫ్లైట్‌ కనెక్టి విటీ లైసెన్సు కోసం రిలయన్స్‌ జియో డిపార్ట్‌‌మెంట్‌ ఆఫ్‌ టెలిక మ్యూని కేషన్స్‌ (డాట్‌ కు ) దరఖాస్తు చేసుకుంది. జియోతోపాటు ఓర్టస్ కమ్యూనికేషన్స్‌ , స్టేషన్‌‌ శాట్‌ కామ్‌‌, క్లౌడ్‌‌కా స్ట్‌‌ డిజిటల్‌‌ కూడా దరఖాస్తు చేసుకున్నాయి .
ఈ విషయమై స్పందించడానికి మాత్రం జియో ఇష్టపడలేదు. అయితే ఓర్టస్‌‌ సహాకొన్ని కంపెనీల నుంచి డాట్ మరిన్ని వివరాలు కోరింది. విమానాల్లో, పడవల్లో మొబైల్‌‌ ఫోన్‌‌ సేవలను అందిం చడానికి ప్రభుత్వం గత ఏడాది డిసెం బరులో అనుమతి ఇచ్చింది. దీంతో ఎయిర్‌‌టెల్‌‌, హ్యూస్‌‌ కమ్యూని కేషన్స్, టాటానెట్‌ వంటివి అప్లై చేసుకున్నాయి . హ్యూస్‌‌కు ఈ ఏడాది ఫిబ్ర వరిలో లైసెన్సు కూడా ఇచ్చారు . టాటానెట్‌ కు సైతం లైసెన్సు వచ్చిం ది. ఎయిర్‌‌టెల్‌‌ సబ్సిడరీకి ఇటీవలే లైసెన్సు జారీ చేశారు.