టు ప్లాట్​ఫామ్స్​లో 25 శాతం వాటా కొన్న జియో

టు ప్లాట్​ఫామ్స్​లో 25 శాతం వాటా కొన్న జియో


హైదరాబాద్​, వెలుగు:  సిలికాన్​ వాలీ డీప్​టెక్​ స్టార్టప్​ కంపెనీ టు ప్లాట్​ఫామ్స్​లో 25 శాతం వాటా కొంటున్నట్లు రిలయన్స్​ జియో ప్లాట్​ఫామ్స్​ ప్రకటించింది. ఇందుకోసం 15 మిలియన్​ డాలర్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. శామ్‌సంగ్​ టెక్నాలజీ మాజీ ప్రెసిడెంట్​ ప్రణవ్​ మిస్త్రీ ఈ టు ప్లాట్​ఫామ్స్​ కంపెనీని నెలకొల్పారు. ఆర్టిఫిషియల్​ రియాలిటీ రంగంలో టు ప్లాట్​ఫామ్స్​ పనిచేస్తోంది. ఏఐ, ఎంఎల్​, ఏఆర్​, మెటావర్స్​, వెబ్​3.0 ఏరియాలలో టు ప్లాట్​ఫామ్స్​ పనితీరు అద్భుతంగా ఉండటంతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు జియో డైరెక్టర్​ ఆకాశ్​ అంబానీ చెప్పారు. టెక్స్ట్​, వాయిస్​ తర్వాత విజువల్​అండ్​ ఇంటరాక్టివ్​ విభాగంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ప్రాముఖ్యం పెరుగుతుందని టు ప్లాట్​ఫామ్స్​ అంచనా వేస్తోంది. మొదట కన్జూమర్​ అప్లికేషన్స్​ కోసం, ఆ తర్వాత ఎంటర్​టెయిన్​మెంట్​, గేమింగ్​ కోసం ఏఐ టెక్నాలజీలను తేనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియా డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​లో జియో కీలకపాత్ర పోషిస్తుండటంతో భాగస్వామ్యంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లు మిస్త్రీ చెప్పారు.