జియో ఓటీటీ పాస్: కేవలం రూ.200కే 15 OTT యాప్స్, అపరిమిత 5G

జియో ఓటీటీ పాస్: కేవలం రూ.200కే 15 OTT యాప్స్, అపరిమిత 5G

భారతీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రిలయన్స్ జియో మరో మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్ ప్రియులకు పండుగలాంటి వార్త అందిస్తూ.. కేవలం రూ.200 ధరతో ఒకే ప్యాక్‌లో ఏకంగా 15 ప్రీమియం ఓటీటీ యాప్స్ యాక్సెస్ ఇచ్చే ‘జియో OTT పాస్’ను బుధవారం, మే 27న విడుదల చేసింది.

ఈ ఒక్క రీఛార్జ్‌తో నెలకు సుమారు రూ.15వందలు విలువైన ప్రయోజనాలను కేవలం రూ.200లకే యూజర్లు పొందొచ్చు. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ పాస్ ద్వారా వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ డేటాను ఒకే ప్యాకేజీలో జియో అదరగొట్టింది.

ఈ పాస్‌లో లభించే 15 ప్రీమియం OTT యాప్స్ లిస్ట్:
1. YouTube Premium
2. Prime Video Mobile Edition
3. JioHotstar Mobile + Hollywood
4. SonyLiv (జియో టీవీ ద్వారా)
5. ZEE5 (జియో టీవీ ద్వారా)
6. Lionsgate Play
7. Discovery+
8. Sun NXT
9. FanCode
10. Kanccha Lannka
11. Planet Marathi
12. Chaupal
13. Hoichoi
14. TimesPlay
15. Tarang Plus

ఓటీటీ యాప్‌లతో పాటు వినియోగదారులు JioTV యాప్ ద్వారా 1000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఇందులో ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన 150కు పైగా పెయిడ్ హెచ్‌డీ ఛానెల్స్ కూడా ఉన్నాయి. జియోస్టార్‌కు చెందిన స్టార్ ప్లస్ HD, కలర్స్ HD, సోనీకి చెందిన SET HD, సోనీ సబ్ HD; సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ టీవీ HD, కేటీవీ HD, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, ఈటీవీ ప్రాంతీయ ఛానెల్స్ అన్నీ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అంటే కేబుల్ టీవీ కనెక్షన్ అవసరం లేకుండానే మొబైల్‌లోనే అంతా చూసుకోవచ్చు.

వినోదంతో పాటు ఇంటర్నెట్ వినియోగానికి కూడా జియో అదిరిపోయే ప్రయోజనాలను ఇచ్చింది. ఈ రూ.200 జియో OTT పాస్ ద్వారా 30 GB హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. దీనితో పాటు.. మీ బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత 5G యాక్సెస్ లభిస్తుంది.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మైజియోయాప్, Jio.com వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లతో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్-పార్టీ రీఛార్జ్ యాప్స్ ద్వారా కూడా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే వినియోగదారుడి మొబైల్‌లో ఏదైనా ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. బడ్జెట్ ధరలో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక క్రేజీ అప్‌డేట్ అని చెప్పుకోవచ్చు.