
దసరా, దీపావళి పండుగల సందర్భంగా jio కంపెనీ రూ.1500 ధర ఉన్న ఫోన్ ను రూ.699 రూపాయలకే ఇవ్వనుంది. ఇందుకు గాను మంగళవారం ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఉన్న కింది స్థాయి వాళ్లకు కూడా ఇంటర్నేట్ సౌకర్యం కల్పించాలన్న ఉద్ధేశంతోనే ఈ ఆఫర్ ను ప్రకటించామని తెలిపింది. దేశంలో 35కోట్ల మంది 2G వినియోగదారులు ఉన్నారని వాళ్లందరినీ 4G వైపు మళ్లించేందుకు చూస్తున్నామని చెప్పింది. ఇప్పుడు ప్రకటించిన ఆఫర్ ను సొంతం చేసుకుంటే 700ల రూపాయల విలువైన డేటాను అందించనున్నట్లు తెలిపింది.