
సెర్చింజిన్ కంపెనీ గూగుల్ తర్వాత ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రిలయన్స్ జియోనే ఉందని ఇప్‌సోస్ 2019 సర్వే వెల్లడించింది. జియో ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ఎనిమిదో స్థానంలో నిలిచినట్టు సర్వే పేర్కొంది. 2019 సర్వేలో 3వ స్థానంలో పేటీఎం, 4వ స్థానంలో ఫేస్‌బుక్, 5వ స్థానంలో అమెజాన్,6వ స్థానంలో శాంసంగ్, 7వ స్థానంలో మైక్రోసాఫ్ట్, 8వ స్థానంలో ఎయిర్‌టెల్, 9వ స్థానంలో ఫ్లిప్‌కార్ట్, 10వ స్థానంలో ఆపిల్ ఉన్నాయి. టాప్ 10 పాపులర్ బ్రాండ్స్‌లో 4 ఇండియన్ కంపెనీలున్నట్టు సర్వే చెప్పింది.