
దసరా – దీపావళి సందర్భంగా రిలయెన్స్ జియో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. 1500 రూపాయలు ఉన్న ఫోన్ ను 699కే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 8 దసరా రోజు నుంచి ఈనెల 27 వరకు ఉండనున్నట్లు జియో ప్రకటించింది. ఇందులో 700రూపాయల విలువగల డేటా ను అంధిస్తుంది. దీంతో పాటు మొదట ఏడు రీచార్జ్ లకు రూ.99 విలువైన డేటాను జియోను అధనంగా ఇవ్వనుంది. ఇప్పటివరకు 2జీలో ఉన్న వాళ్లు 4జీకి మారిపోయే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఇందులో ఫోన్ ఎక్సేంజ్ వంటి ఆఫర్ లేదు.