ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఓటీటీ బెన్ఫిట్స్తో కూడిన సరికొత్త రీఛార్జ్ ప్లాన్ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ విలువ రూ.1,049. డైలీ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు మాత్రమే కాదు ఓటీటీ బెన్ఫిట్స్ కూడా కస్టమర్లు పొందొచ్చు. సోనీ లివ్, జియో సినిమా, జీ5 ఓటీటీ కంటెంట్ను ఫ్రీ సబ్స్క్రిప్షన్ వెసులుబాటుతో 84 రోజుల పాటు వీక్షించవచ్చు. ఓటీటీ కంటెంట్ లవర్స్కు 84 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చిన ఈ రూ.1,049 ప్లాన్ చాలానే ఉపయోగపడే ఛాన్స్ ఉంది.
కాకపోతే.. ఈ మూడు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ కంటెంట్ మాతమ్రే ఉండటం.. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ కంటెంట్ సేవలు 1,049 ప్లాన్లో లేకపోవడం ఓటీటీ లవర్స్కు కొంతమేర నిరాశ మిగిల్చే అంశమని చెప్పక తప్పదు. అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందే అవకాశం ఈ ప్లాన్ కల్పించింది. మీ ఏరియాలో 5జీ కనెక్టివిటీకి అందుబాటులో ఉండి, మీరు వినియోగిస్తున్నది 5జీ స్మార్ట్ ఫోన్ అయి ఉంటే మాత్రం ఇది కచ్చితంగా గుడ్ న్యూసే.
ALSO READ | జియో కొత్త రీచార్జ్ ప్లాన్ రూ. 122, రోజుకు 1GB డేటాతో..
దేశంలోనే అతి పెద్ద టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో దాదాపు 49 కోట్ల మంది రిలయన్స్ జియో వినియోగదారులు కావడం గమనార్హం. ఇటీవల రిలయన్స్ జియోతో సహా ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్ ధరలను ఉన్నపళంగా పెంచిన విషయం విదితమే. టారిఫ్ ధరలు పెంచడంతో బీఎస్ఎన్ఎల్ వైపు కొందరు వినియోగదారులు మొగ్గుచూపారు. దీంతో.. వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరలు తగ్గించకపోయినప్పటికీ వ్యాలిడిటీ పెంచడమో, ఓటీటీ సేవలను జోడించడమో చేసి రిలయన్స్ జియోతో పాటు ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ వినియోగదారులను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.