
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో వినాయక చవితి ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మండపానికి సంబంధిత పోలీస్ఆఫీసర్ వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన టైం, నిమజ్జన టైంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి సిబ్బందికి వివరించారు. మూడేండ్లుగా మిలాద్ ఉన్ నబీ కూడా నవరాత్రుల సమయంలోనే వస్తోందని, ఈ ఏడాది కూడా అదే టైంలో రావడంతో ఏం చేయాలన్న దానిపై సూచనలు ఇచ్చారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ పాల్గొన్నారు.