
- అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
పరిగి, వెలుగు: తిండీతిప్పలు మాని యూరియా కోసం రైతులు.. ఎండనక వానానక క్యూలైన్లలో నానా కష్టాలు పడుతుంటే.. ఓవైపు వ్యాపారులు మాత్రం అక్రమంగా యూరియాను రాత్రిపూట బ్లాక్లోఅమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్షాపు గోడౌన్నుంచి శనివారం రాత్రి ఆటోలో యూరియాను అక్రమంగా తరలిస్తుంటే.. స్థానిక రైతులు వీడియో తీసి సోషల్మీడియాలో వైరల్చేశారు. తాము ఉదయం నుంచి రాత్రి వరకు లైన్లో నిలబడ్డ టోకెన్ దొరకట్లేదని, కానీ వ్యాపారులకు మాత్రం రాత్రిపూట అమ్మేందుకు యూరియా ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విజిలెన్స్, వ్యవసాయఅధికారులు సైతం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఫర్టిలైజర్షాపులు, గోడౌన్లో ఉన్న యూరియా నిల్వలపై దాడులు నిర్వహించి, బ్లాక్ దందాను ఆపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.