
న్యూఢిల్లీ: గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్, కొన్ని నెలలుగా ఉద్యోగుల జీతాల చెల్లింపులను ఆలస్యం చేస్తోందని పీటీఐ రిపోర్ట్ చేసింది. రూ.55 వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు ఆగస్టు జీతాలు చెల్లించినప్పటికీ, అసిస్టెంట్ మేనేజర్ కంటే పైస్థాయి ఉద్యోగులకు 10–15 రోజుల ఆలస్యంగా శాలరీ వేస్తోంది. 2024-–25లో చైర్మన్ అజయ్ సింగ్‌కు రూ.32 కోట్ల వడ్డీ లేని అడ్వాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కంపెనీ కిందటి ఆర్థిక సంవత్సరంలో మేనేజర్ ఉద్యోగుల జీతాన్ని 13.5 శాతం పెంచగా, ఇతరులకు 6.21 శాతం హైక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి స్పైస్‌జెట్‌లో 6,484 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, అప్పులతో ఇబ్బంది పడుతున్న ఈ కంపెనీకి ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.238 కోట్ల నష్టం వచ్చింది.