
న్యూఢిల్లీ: 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో డేటా డౌన్లోడ్ స్పీడ్‌లో జియో టాప్‌లో నిలిచినట్లు ట్రాయ్ డేటా వెల్లడించింది. అక్టోబర్ నెల డేటాను ట్రాయ్ ప్రకటించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లు కూడా తమ డేటా డౌన్లోడ్ స్పీడ్‌ను పెంచుకుంటున్నాయని, జియోకి వాటికీ మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోతోందని ఈ డేటా పేర్కొంది. అక్టోబర్ నెలలో 21.9 ఎంబీపీఎస్ 4జీ డౌన్లోడ్ స్పీడ్‌ను జియో నమోదు చేసింది. డేటా అప్లోడ్ స్పీడ్‌లో వీఐ తన లీడర్షిప్ను కొనసాగిస్తోందని తెలిపింది. అక్టోబర్ నెలలో ఈ డేటా అప్లోడ్ స్పీడ్ 7.6 ఎంబీపీఎస్‌గా నమోదయిందని పేర్కొంది. మైస్పీడ్ అప్లికేషన్ నుంచి కలెక్ట్‌చేసిన డేటాను విశ్లేషించి ట్రాయ్ ఈ ఏవరేజ్ డేటా స్పీడ్‌ను లెక్కించింది.