జియో కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఫ్రీగా అందించిన జియో సినిమా సర్వీస్ లు.. ఇకనుంచి యూజర్ల ద్వారా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా జియో సినిమాకు విపరీతమైన ఆదరణ లభించడంతో.. త్వరలో సినిమాలు, వెబ్ సిరీస్లతో అలరించనుంది. అందుకు యూజర్లనుంచి ఛార్జీలు వసూలు చేయనుంది. కొత్తగా వసూలు చేయనున్న ఛార్జ్ వివరాలు లీక్ అవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ఇప్పటివరకున్న డైలీ ప్లాన్ ధర రూ.29కాగా, 93 శాతం డిస్కౌంట్ తో రూ.2కే అందించనున్నట్లు తెలుస్తోంది. 3నెలల వ్యాలిడిటీ ఉన్న గోల్డ్ స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.299 కాగా, రూ.99కే జియో అందించనుంది. ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రీమియం ప్లాన్ ధర రూ.1,199 కాగా, రూ.599కే అందించన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రేట్లను అధికారికంగా ప్రకటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.