గూగుల్పే, ఫోన్ పే, పేటీఎంలకు పోటీగా..జియో ఫైనాన్స్ యాప్ లాంచ్

గూగుల్పే, ఫోన్ పే, పేటీఎంలకు పోటీగా..జియో ఫైనాన్స్ యాప్ లాంచ్

జియో.. కొత్త ఫైనాన్సియల్ యాప్ ను ఆవిష్కరించింది.యూపీఐ లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్ బిల్ సెటిల్ మెంట్, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు వంటి సేవ లను ఒకే యూజర్ తో అందించడానికి జియో ఫైనాన్స్ యాప్ ను బుధవారం (మే 29)   ప్రారంభించింది. మార్కెట్లో ప్రస్తుతం UPI సేవలందిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీంయాప్ ల మాదిరిగానే జియో ఫైనాన్స్ యాప్ కూడా ఫైనాన్సియల్ సర్వీస్ ను అందిస్తుంది. రోజువారీ ఆర్థిక, డిజిటల్ బ్యాంకింగ్ లో విప్లవాత్మక మైన లే టెస్ట్ ప్లాట్ ఫాం అందించే లక్ష్యంతో  తన కొత్త వెంచర్ జియో ఫైనాన్స్ యాప్ ను  తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. 

జియో ఫైనాన్స్ యాప్ ఫీచర్లు

ఈ యాప్ UPI లేవాదేవీలు, బిల్లు సెటిల్ మెంట్లు, బీమా అడ్వైజరీ వంటి సేవలను అందిస్తుంది. వినియోగదారుల అన్ని ఆర్థిక అవసరాలను తీరుస్తూ మనీ మేనేజ్ మెంట్ భరోసాని ఇస్తుంది. 

అంతేకాకుండా భవిష్యత్తులో లోన్లు, మ్యూచువల్ ఫండ్స్ పై లోన్ల నుంచి హౌసింగ్ లోన్ల వరకు విస్తరించనున్నట్లు రిలయన్స్ సంస్థ  తెలిపింది. లెండింగ్, ఇన్వెస్ట్ మెంట్, ఇన్సూరెన్స్, పేమెంట్లు, లావాదేవీల వంటి ఆర్థిక సేవలను మరింత పారదర్శకంగా  ఒకే ఫ్లాట్ ఫాంలో అందించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 
ఏంటీ జీయో ఫైనాన్సియల్ సర్వీస్ .. 

జియో ఫైనాన్సియల్ సర్వీసెస్..భారతదేశంలోని పట్టణ, సెమీ అర్బన్,గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, చిన్న వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి.. ఈజీగా ఉపయో గించగల పారదర్శకమైన ఫైనాన్సియల్ సర్వీసులను అందిస్తుంది.