
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం కంపెనీ జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ. 2999తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ఏడాది పాటు కాల్స్. ఇంటర్నేట్ సౌకర్యంతో పాటుగా కూపన్‌లు ప్రకటించింది. రూ.2,999తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది.
జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటు ఫ్రీగా చూడవచ్చు. అంతేకాకుండా అదనంగా నెట్‌మెడ్స్, అజియో, ఇక్సిగో, తిరా, స్విగ్గీ కూపన్లను జియో అందిస్తోంది. 2024 జనవరి 15 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.
అజియోలో రూ.2,499 పైగా షాపింగ్ చేస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఆన్‌లైన్ బ్యూటీ ప్రొడక్ట్ ప్లాట్‌ఫామ్ తిరా లో రూ.1000, అంత కంటే ఎక్కువ మొత్తంలో చేసే కొనుగోళ్లపై 30శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఇక్సిగో లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,500 తగ్గింపు పొందొచ్చు. స్విగ్గీ ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.125 విలువైన రెండు డిస్కౌంట్ కూపన్లు రీఛార్జి ద్వారా లభిస్తాయి. రిలయన్స్ డిజిటల్‌లో రూ.5వేల కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ ఉంటుంది.
జియో రూ. 2999తో రీఛార్జ్ చేసుకుంటే మైజియో కౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటిల్లోని కోడ్స్‌ని కాపీ చేసుకుని, పార్ట్నర్ యాప్స్/ వెబ్‌సైట్స్‌లో అప్లై చేసుకుంటే డిస్కౌంట్ పొందొచ్చు.అయితే కూపన్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది