బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి జితెన్ ప్రసాద 

బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి జితెన్ ప్రసాద 

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జితెన్ ప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే జితెన్ పార్టీ మారడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో జితెన్ ప్రసాద బీజేపీలోకి జంప్ అవ్వడం కాంగ్రెస్‌కు షాకింగ్ పరిణామమని చెబుతున్నారు. యూపీలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జితెన్ టాప్ లీడర్‌గా ఉన్నారు. కాగా, పార్టీ మార్పుపై జితెన్ స్పందిస్తూ.. ఇప్పుడు తాను అసలైన పార్టీలో ఉన్నానని చెప్పారు. ‘బీజేపీయే అసలైన పొలిటికల్ పార్టీ. బీజేపీ మాత్రమే ఏకైక జాతీయ పార్టీ. మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు బీజేపీతోపాటు ప్రధాని మోడీ మాత్రమే పరిష్కారాలు చూపగలరు. ఇప్పుడు నేను నిజమైన రాజకీయ పార్టీలో ఉన్నాననే భావనను అనుభూతి చెందుతున్నా’ అని జితిన్ ప్రసాద పేర్కొన్నారు.