2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు: జితేందర్ రెడ్డి

2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు: జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, వెలుగు: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిబ్రవరి 17న సెక్రటేరియెట్ ను ఓపెన్ చేశాక సీఎం కేసీఆర్​అసెంబ్లీని రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశంతో పాటు కేసీఆర్ కుటుంబ పాలన, రాష్ట్ర అప్పులపై కార్యవర్గ సమావేశంలో చర్చించాం. 

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానం, ముసాయిదా బడ్జెట్ ప్రవేశపెట్టగా..  నేను, వివేక్ వెంకట్ స్వామి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి మద్దతు తెలిపాం” అని ఆయన చెప్పారు. ‘‘2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు. ఎన్నో హామీలిచ్చి ఒక్కటన్నా నెరవేర్చలేదు. అవన్నీ ప్రజలకు తెలుసు” అని అన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు రాష్ర్టంలో 11 వేల శక్తి కేంద్రాల పరిధిలో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యకర్తలు సరల్ యాప్​ను డౌన్ లోడ్ చేసుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 78200 78200 నంబర్​కు మిస్డ్​కాల్ ఇచ్చి పార్టీలో చేరొచ్చన్నారు.