ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి

ఢిల్లీలో  తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు  స్వీకరించారు జితేందర్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. 

కృష్ణా నుంచి రావాల్సిన  నీటి వాటా కూడా రాలేదన్నారు జితేందర్ రెడ్డి.సాగునీరు, త్రాగు నీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్ లో  పెట్టిందని తెలిపారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి తెస్తాం.. ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయన్నారు. ఏపీ భవన్ విషయంలో  ఎటువంటి అనుమతి అవసరం లేదన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందన్నారు. త్వరలోనే ఢిల్లీలో తెలంగాణాకు కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపిలు మల్లురవి,రఘురామి రెడ్డి,బలరాం నాయక్,చామల కిరణ్ కమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు వివేక్, యన్నం శ్రీనివాస్ రెడ్డి,మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీ హారి,మాజీ మంత్రి జానారెడ్డి హాజరయ్యారు.