64.4శాతం పెరిగిన జేకే సిమెంట్ లాభం.. నాలుగో క్వార్టర్​లో రూ. 361 కోట్లు

64.4శాతం పెరిగిన జేకే సిమెంట్ లాభం.. నాలుగో క్వార్టర్​లో  రూ. 361 కోట్లు

న్యూఢిల్లీ: జేకే సిమెంట్ లిమిటెడ్​కు (జేకేసీఎల్) 2025 ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో  నికర లాభం (కన్సాలిడేటెడ్​)64.5 శాతం పెరిగి రూ. 361.33 కోట్లకు చేరుకుందని తెలిపింది. సంస్థ గత ఏడాది జనవరి-–మార్చి కాలంలో రూ. 219.68 కోట్ల లాభాన్ని సాధించింది. ఆదాయం 15.3 శాతం పెరిగి రూ. 3,581.18 కోట్లకు చేరుకుంది. 

గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,105.77 కోట్లు వచ్చాయి. జేకేసీఎల్  మొత్తం ఖర్చులు మార్చి క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన 9.8 శాతం పెరిగి రూ. 3,092.04 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయాన్ని కలుపుకుంటే  జేకేసీఎల్  మొత్తం ఆదాయం రూ. 3,627.06 కోట్లు అవుతుంది. 

2025 మార్చి 31తో ముగిసిన పూర్తి  ఆర్థిక సంవత్సరానికి, జేకే సిమెంట్ లాభం 10.4 శాతం పెరిగి రూ. 872.17 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇది రూ. 789.93 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్​పద్ధతిలో మొత్తం ఆదాయం 3 శాతం పెరిగి రూ. 12,052.10 కోట్లకు చేరుకుంది.