జూన్ 21న జేఎన్టీయూలో అవగాహన సదస్సు

జూన్ 21న  జేఎన్టీయూలో అవగాహన సదస్సు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో జేఎన్టీయూలో శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఎప్​సెట్​ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్​లో అడ్మిషన్స్​ కోసం అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్​ బాలకృష్ణారెడ్డి, వీసీ​కిషన్​కుమార్​రెడ్డి సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. సదస్సు హాజరు కావాలనుకునే వారు గూగుల్​ ఫామ్​ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకుని రావాలని సూచించారు.