పిట్లం, వెలుగు: ఐక్యూ ఏసీ, టాస్క్ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్కె.అశోక్తెలిపారు. విజయ బయో ఫెర్టిలైజర్స్కంపెనీలో సేల్స్ఎగ్జిక్యూటివ్, గ్రూప్లీడర్, టీమ్ మేనేజర్పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నట్లు చెప్పారు.
ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులన్నారు. వీటితోపాటు ముత్తూట్ఫైనాన్స్లో ఇంటర్న్షిప్కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, డిగ్రీ పాసైనవారు ఇందుకు అర్హులని తెలిపారు. సెలెక్ట్అయినవారిని ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్స్థాయికి ప్రమోట్చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
