లక్ష మంది మహిళలకు జాబ్స్‌‌: వైట్‌‌హ్యాట్‌‌ జూ

లక్ష మంది మహిళలకు జాబ్స్‌‌: వైట్‌‌హ్యాట్‌‌ జూ

న్యూఢిల్లీ: చిన్నపిల్లలకు ఆన్‌‌లైన్‌‌ కోడింగ్‌‌ క్లాస్‌‌లను చెప్పే వైట్‌‌హ్యాట్‌‌ జూ. బ్రెజిల్‌‌, మెక్సికో వంటి  దేశాలకు విస్తరించాలని ప్లాన్స్‌‌వేసుకొంది. జనవరిలో మ్యాథ్స్‌‌ క్లాస్‌‌లను లాంచ్ చేస్తామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది మహిళా టీచర్లను నియమించుకుంటామని తెలిపింది. వన్ ఆన్‌‌ వన్‌‌ టీచింగ్‌‌ మోడ్‌‌లో ఈ లక్ష జాబ్‌‌లను క్రియేట్ చేస్తామని కంపెనీ సీఈఓ కరన్ బజాజ్‌‌ ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. టీచర్లు తమ ఇళ్లల్లోనే, తమకు నచ్చిన టైమ్‌‌లలో టీచింగ్‌‌ చేస్తూ, ఎంట్రీ లెవెల్‌‌ ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్స్‌‌కు వచ్చే శాలరీని పొందొచ్చని తెలిపారు. బ్రెజిల్‌‌, మెక్సికోలలో లోకల్‌‌ టీచర్లు, లోకల్‌‌ స్టూడెంట్లతో యాప్‌‌ను టెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కోడింగ్‌‌ క్లాస్‌‌లను చెప్పేందుకు స్కూళ్లతో కంపెనీ టై అప్‌‌ అవుతోంది. ఇప్పటి వరకు 100 స్కూళ్లతో టై అప్‌‌ అవ్వగా, వచ్చే కొన్ని నెలల్లో మరో వెయ్యి స్కూళ్లకు విస్తరించాలని కంపెనీ టార్గెట్‌‌గా పెట్టుకొంది.   ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియా, యూఎస్‌‌, యూకే, న్యూజిల్యాండ్‌‌, ఆస్ట్రేలియాల నుంచి 1.5 లక్షల పెయిడ్‌‌ స్టూడెంట్లున్నారు.