కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలి: చింతల రామచంద్రారెడ్డి

కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలి: చింతల రామచంద్రారెడ్డి

బాన్సువాడ, ​పిట్లం, వెలుగు: రాష్ట్రంలో ​డబుల్​ఇంజిన్​ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్​వైస్​ ప్రెసిడెంట్, ఖైరతాబాద్​ మాజీ ఎమ్మెల్యే​ చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మంగళవారం బాన్సువాడ, జుక్కల్​లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్​ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. 

కేంద్రం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి రూ. నాలుగు లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. ప్రజల్లో బీజేపీకి  ఆదరణ పెరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార, మండలాల పార్టీ ప్రెసిడెంట్లు బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి మల్యాద్రి రెడ్డి, లీడర్లు శ్రీనివాస్ గార్గే, అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, పైడిమల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.